తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది టీటీడీ. జులై నుండి సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల తేదీలను ప్రకటించింది టీటీడీ. జూలై నుండి సెప్టెంబరు 30వ తేదీ వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రేక్ దర్శనాలు రద్దైన తేది… కారణం:
- జులై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- జులై17: ఆణివార ఆస్థానం.
- జులై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద.
- జులై 29: జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం.
- ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
- ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ.
- సెప్టెంబరు 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- సెప్టెంబరు 14: శ్రీవారి బ్రహ్మోత్సవాల’కు అంకురార్పణ.
- సెప్టెంబరు 15 నుండి 23వ తేది వఱకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.
ఈ తేదీల్లో ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ప్రవేశపెట్టింది టీటీడీ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించి సూచించింది టీటీడీ.

