తెలంగాణా : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త సమయం దొరికితే చాలు తన మనవడితో కలసి ఆడుకుంటారు.
తెలంగాణ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త సమయం దొరికితే చాలు తన మనవడితో కలసి ఆడుకుంటారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. మనవడికి తాతేనన్న భోజనం ఆయన మర్చిపోయినట్లు వ్యవహరించారు. మనవడి కళ్లల్లో ఆనందం కోసం ఆయన వంటమనిషిగా మారి ముఖ్యమంత్రి కిచెన్ లోకి వెళ్లి పూరీలు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాత పూరీ అంటూ…
“తాతా.. నువ్వు పూరీలు వేస్తేనే” అని మనవడు అడిగితే తప్పుతుందా?పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు…బిజీ నది సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు. కాస్త తీరిక దొరికితే చాలు మనవడి చిన్ని చిన్ని కోరికలను తీరుస్తూ ముచ్చటపడుతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
వార్తల సారాంశం – రేవంత్ మనవడికి పూరీలు వేయించాడు

