పిఎండిఎస్ ఆచరించి జీవవైవిధ్యాన్ని పెంపొందించుకొండి
విశాలాంధ్ర ధర్మవరం:: పిఎండీఎస్ ఆచరించి జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవాలని వ్యవసాయ ఏడిఏ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం మండల పరిధిలోని మల్కాపురం గ్రామం నందు రైతు శ్రీ పక్కిరప్ప పొలాన్ని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి సేద్యంలో భాగంగా విత్తన గుళికలు తయారు చేసి 2 ఎకరాల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేయడం జరిగింది. ఈ విధానం వల్ల రైతులకు వివరించడం జరిగింది అని తెలిపారుఈ విధానంలో ఐదు ప్రధానమైన పంటలతో పాటు దాదాపు 25 రకాల జీవవైద్య పంటలకు చెందిన విత్తనాలను బీజామృతంతో కడిగి బంకమన్ను, ఘనజీవామృతము బూడిదలతో పొరలుగా అంటించి ఆరబెట్టిన తర్వాత గొర్రుతో లేదా వెదజల్లడం ద్వారా విత్తడం జరుగుతుంది. పెల్లటైజేషన్ చేసిన విత్తనాలు వర్షం పడినా మొలకెత్త సమ్మేళనం. విత్తనాలు తేమను ఎక్కువ నిలువ చేసుకోవడం వల్ల త్వరగా మొలకెత్తడమే కాకుండా పక్షులు ఇతర కీటకాల నుంచి కొంతవరకు రక్షణ పొందుతాయి. ప్రారంభ దశలో ఎదుగుదల బలంగా ఉండటంతోపాటు నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరిగి నేల మెరుగుపడుతుందని తెలిపారు. మల్కాపురం గ్రామంలో అమలవుతున్న పంట నమోదులో రాజ్యసభ కేంద్ర సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే పంట సాగు చేసిన రైతు సోదరులందరూ తప్పనిసరిగా ఖరీఫ్ 2026కు సంబంధించి పంట నమోదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, బీటీఎం ప్రతిభ, వీహెచ్ఈ గోట్లు రాశాజ్యోతి,వ్యవసాయ సిబ్బంది ఆదినారాయణ, పక్కీరప్ప, నాగరత్న, గ్రామ రైతులు ఉన్నారు.

