- పూర్తి నిద్రపోయినా అలసటగా ఉంటుందా..?
- విటమిన్ లోపం గుర్తించిన వైద్యులు..
- జుట్టు రాలడం, గోర్లు విరగడం, నోటిపూతలు కూడా సంకేతాలే.
విటమిన్ లోపం: రాత్రి నిద్ర బాగా పడుతున్నప్పటికీ, కొందరు ఉదయాన్ని మళ్లీ అలసటగా ఫీల్ అవుతారు. తరుచుగా గోర్లు విరిగిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు సాధారణ సమస్యలుగా అనిపిస్తాయి. అయితే, ఇవి శరీరంలోని విటమిన్లు, ఖనిజాల లోపానికి కారణాలు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా పోషకాహార లోపం పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనులు చాలా మంది బీ12, డీ విటమిన్ లోపాలతో సతమతమవుతున్నారు.
విటమిన్ లోపాన్ని సూచించే లక్షణాలు ఇవే:
*తగినంత నిద్రపోయినప్పటికీ నీరసంగా అనిపించడం, ఇది శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందడం లేదని తెలుస్తోంది.
*సీజన్‌తో సంబంధం లేకుండా జట్టు బాగా రాలిపోవడం కూడా విటమిన్స్ లోపంగానే గుర్తించాలి.
*తరుచుగా నోటిలో పూత, పెదవులు పగలడం కూడా విటమిన్, మినరల్ డెఫిషియెన్సీకి కారణం కావచ్చు.
*చర్మం పాలిపోవడం, గోర్లు బలహీనంగా మారడం, గోర్లు తరుచుగా విరగడం, చర్మం కాంతిని కోల్పోవడం పోషకాహార లోపానికి సంకేతాలు.
ఎలా నిర్ధారించాలి.?
సాధారణ రక్త పరీక్షల ద్వారా విటమిన్, ఖనిజాల లోపాన్ని గుర్తించేందుకు వైద్యులు చెబుతున్నారు. సమయానికి పరీక్షలు చేయించుకుని, ఆహారంలో మార్పులు చేసుకోవడం, వైద్యుల సూచనల మేరకు విటమిన్ సప్లిమెంట్లు వాడటం చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.

