వాహనాలకు ఎటువంటి నష్టం కలగదు: గడక్కరీ
న్యూదిల్లీ: పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ (ఈ-20)తో వాహనాలు దెబ్బతింటాయని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడక్కరీ తాజాగా స్పందించారు. ఇథనాల్ కలోరిఫిక్ వాల్యూ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుందని...ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగితే... వాహనాల మైలేజీ కాస్త తగ్గే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. అయితే అధిక ఇథనాల్ బ్లెండ్ వాడుతున్న వాహనాలను పరిశీలించినప్పుడు...మైలేజీ తగ్గడం పరిమితమేనని, వాహనాలకు నష్టమేమీ ఉండదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ.2 లక్షల కోట్ల విలువ చేసే శిలాజ ఇంధనాలను (పెట్రోలియం, బొగ్గు, సహజవాయువు) దిగుమతి చేసుకుంటున్నామని, దేశంలో అత్యధిక కాలుష్యం వాటి వాడకం వల్లే వస్తోందన్నారు. ఈ దిగుమతులను తగ్గించడానికి స్వదేశీ ఇంధనాల వినియోగం ఒక్కటే మార్గమని తేల్చిచెప్పారు. ఇథనాల్ వినియోగంతో వాహనాలు దెబ్బతింటాయంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారని, తప్పుడు ప్రచారం కుట్రలో ఇది భాగమని విమర్శించారు. ఈ-20 ఇంధన వినియోగంతో దెబ్బతిన్న కారును ఒక్కదానినైనా తనకు చూపించాలన్నారు. బ్రెజిల్లో 1970 నుంచి 27 ఇథనాల్-పెట్రోల్ బ్లెండ్ వాడుతున్నారని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని సూచిస్తోందని గడక్కరే వివరించారు. బయో ఇంధనం
ఈ-20గురించి…
ఇథనాల్ అనేది…చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటలను సేకరించే జీవ ఇంథనం (బయో ఇంధనం). ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి దీన్ని పెట్రోల్‌తో కలిపి (20 ఇథనాల్, 80 పెట్రోల్) ఉపయోగిస్తున్నారు. దీని వినియోగం వల్ల కాలుష్యం కొంత మేర తగ్గించుకోవచ్చు. దీని వాడకంతో కార్బన్‌మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు తగ్గుతాయి. శిలాజ ఇంధనాల (పెట్రోల్, బొగ్గు, గ్యాస్)పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, వ్యవసాయ రంగానికి అదనపు డిమాండ్ కలిగించినట్లు అవుతుంది.
పోస్ట్ ఈ – 20తో మైలేజీ తగ్గే అవకాశం మొదట కనిపించింది విశాలాంధ్ర.

