48 గంటల్లో షరతులు అంగీకరిస్తే తీవ్ర పరిణామాలు
పాక్కు జేఏఏసీ అల్టిమేటమ్
ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పాక్ ప్రభుత్వ తీరుపై నిరసనకారులు మండిపడుతున్నారు. 48 గంటల్లోగా తమ డిమాండ్లకు పాక్ పాలకులు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జైంట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) సారథ్యంలో నిరసనకారులు ఈ అల్టిమేటమ్ జారీ చేశారు. పాక్ ప్రభుత్వం ముందు 38 డిమాండ్లు ఉంచారు.
అణచివేత ధోరణే ఆరని మంటలకు కారణం…
రాజకీయంగా పీఓకేపై ఆధిపత్యం సాధించేందుకు రకరకాల కుయుక్తులను పాక్ పాలకులు పన్నడానికి మండిపడుతోంది. పీఓకే అసెంబ్లీలో 12 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను పాక్ పాలకులే నామినేట్ చేయడంపై జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీఓకే కోసం పాక్ పాలకులు ఎలాంటి అభివృద్ధి చర్యలు తీసుకోవడం లేదని జేఏసీ ఆరోపిస్తోంది.
పాక్ నుంచి వలసొచ్చిన 4.36 లక్షల మంది ఓటర్లకు ఈ 12 సీట్లను కేటాయించడం, 33 లక్షల మంది పీఓకే ఓటర్లు మాత్రం కేవలం 33 సీట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీఓకేను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ఈ ఎత్తుగడకు పాక్ పాలకులు తెరతీశారని జేఏఏసీ మండిపడుతోంది. ఈ 12 సీట్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ సీట్లను రద్దు చేయాల్సిందేనని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. వీటితో పాటు గతంలో ప్రతిపాదించిన హైడ్రోప్రాజెక్టులపై మళ్లీ చర్చలు ప్రారంభించడం, నిత్యావసరాలపై సబ్సిడీలు పెంచడం, విద్యుత్ ధరలు తగ్గించడం వంటి 38 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది. 27న పీఓకేలో ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి నుంచీ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ. ఈ నేపథ్యంలోనే జేఏఏసీ తాజా అల్టిమేటమ్ జారీ చేసింది.
పోస్ట్ పీఓకేలో మిన్నంటిన నిరసనలు మొదట కనిపించింది విశాలాంధ్ర.

