- ఇరాన్‌తో చర్చలకు అమెరికా అంగీకారం
- “కల్పుల విరమణ ముగిసింది” అని ట్రంప్ స్పష్టీకరణ
డోనాల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చర్చలపై కీలక ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలను ఇరాన్ కోరిందని, అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ”ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మమ్మల్ని ‘చర్చలు’ కొనసాగించమని కోరింది. మేము అలా చేయడానికి అంగీకరించాము, కానీ కాల్పుల విరమణ ముగిసిందని యునైటెడ్ స్టేట్స్ వారికి స్పష్టంగా చెప్పింది” అని పోస్ట్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటి వరకు స్పందించలేదు.
హోర్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకగా ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడంతో ఈ తాజా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ దాడులకు ఇరాన్ వైఖరే కారణమని అమెరికా ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కువైట్, బహ్రైయిన్‌లపై దాడాలను ఏర్పాటు చేసింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా రైల్వే కారిడార్, చాబహార్ పోర్టులతో పాటు పలు ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది.

