రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతంలో ఆరుగురి హత్యలతో ఉలిక్కిపడింది. ప్రశాంతపు ఉదయం వేళ హత్యల సమాచారం అందరినీ భయాందోళనకు గురిచేసింది. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన నిందితుడు రాజ్ కుమార్ ప్రియురాలు మైనర్ బాలికను, ఆమెతోపాటు తల్లిని, నానమ్మను హత్య చేశాడు. ఆ తర్వాత భార్యా బిడ్డల్ని అంతమొందించి కారులో పరారయ్యాడు. ఈ మారణ హోమం కేవలం 20 నిమిషాల్లోనే సాగిందని పోలీసులు. షాబాద్ ఆరుగురి హత్య కేసులో కొనసాగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11 గంటల పది నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల మధ్యలో హత్యకాండ కొనసాగుతుందని తెలిపారు. 11 గంటల పది నిమిషాలకి మైనర్ బాలిక ఇంటికి రాజకుమార్ చేరుకున్నాడు. 11. 12 నిమిషాలకి మైనర్ బాలిక ఇంటి తలుపు తట్టాడు. 11.13 రాజ్ కుమార్ తలుపు తట్టడంతో డోర్ ఓపెన్ చేసిన మైనర్ బాలిక తల్లి. డోర్ ఓపెన్ చేయగానే ఆమె కడుపులో కత్తితో పొడిచాడు. మైనర్ బాలిక తల్లి కింద పడగానే ఇంటి లోపలికి వెళ్ళాడు రాజకుమార్.. ఇంటి లోపల ఉన్న నాయనమ్మ రుక్కమ్మను గొంతు కోసి చంపాడు. రుక్కమ్మ చనిపోయిన తర్వాత బాలిక తల్లి లక్ష్మిని పొడిచి చంపిన రాజకుమార్.. ఇద్దరిని చంపేసిన తర్వాత మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు.
నాలుగు దూరంలో ఉన్న దేవదుల చెరువు వద్దకు బాలికను తీసుకువెళ్లాడు. చెరువు వద్ద బాలిక గొంతు కోసి చంపేశాడు. బాలికను చంపేసి నేరుగా తన ఇంటికి వెళ్లాడు రాజకుమార్.. మధ్యాహ్నం సమయంలోనే ఇంటికి వస్తున్నట్లుగా భార్యతో చెప్పాడు. భర్త రాజ్ కుమార్ వచ్చిన సమయంలో బాలుడికి పాలు పట్టిస్తున్న భార్య.. భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భార్య భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా విడవకుండా భార్య కడుపుతో పాటు గొంతు కోసి చంపేశాడు.
భార్య చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపేశాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చి తండ్రికి కాల్ చేశాడు రాజ్ కుమార్. ఆరుగురిని చంపేశాను తాను చనిపోతాను అంటూ తండ్రికి ఫోన్ లో చెప్పాడు. 11. 57 నిమిషాలకు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. 11 గంటల 57 నిమిషాలకు రాజ్ కుమార్ కారులో పారిపోయాడు. రాజ్ కుమార్ పెద్ద ఎత్తున ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టి నష్టపోయినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ..
రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల ఘటనపై ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక వివరాలు. రాత్రి జరిగిన ఈ ఘటనపై మాట్లాడిన ఆయన, దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలను వివరించారు. సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ, రాత్రి హత్య జరిగినట్లు తమకు సమాచారం ఉందని, ఈ రెండు ఘటనలు వచ్చి ఉన్నాయని చెప్పారు. మొదట నిందితుడు రాత్రి 11 గంటల సమయంలో షాబాద్లోని బాధితురాలి ఇంటికి వెళ్లాడని, అక్కడ బాధితురాలి తల్లి, నానమ్మను కత్తితో హత్య చేశాడని చెప్పారు. మే 16న నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయిందని, ఆ కేసులో అతనికి బెయిల్ లభించిందని సీపీని గుర్తించామన్నారు.
నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, బాధితురాలికి తల్లి, నానమ్మ ఉన్నారని చెప్పారు. బాధితురాలి తల్లి, నానమ్మను హత్య అనంతరం బాలికను నగర్కుంట సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడని వివరించారు. ఆ తర్వాత నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని సీపీ తెలిపారు. హత్యల అనంతరం రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి “నేను ఆరుగురిని చంపాను… నేను కూడా చనిపోయాను” అని చెప్పాడు.
పోస్ట్మార్టం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడని, ఏడుగురు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీపీఐ. భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేయడం తమను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు.

