లెజెండరీ గాయని ఎస్. జానకి(88) కన్నుమూశారు. వయోభారంతోపాటు అనారోగ్యం కారణంగా ఆమె మరణించారు. కార్డియాక్ అరెస్ట్ రావడంతో జనకమ్మను మైసూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. దీనితో దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో విషాదం. సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘దక్షిణ భారత నైటింగేల్’గా పేరు సంపాదించుకున్న జానకి.. సౌత్ లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో సింగర్ జానకి పాటలు పాడారు. ఇప్పటివరకు ఆమె.. నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, 33 వివిధ రాష్ట్ర స్థాయి చలనచిత్ర అవార్డులను అందుకున్నారు.
ఎస్. జానకి కుటుంబ నేపథ్యం
సింగర్ జానకి 1938 ఏప్రిల్ 23న బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పల్లపట్ల (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్)లో జన్మించారు. ఆమె తండ్రి సిస్ట్ల శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడిగా, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆమె తన బాల్యంలో ఎక్కువ మంది సిరిసిల్లలో గడిపారు. అక్కడే కేవలం తొమ్మిదేళ్ల వయసులో మొదటిసారిగా వేదికపై ప్రదర్శన ఇచ్చారు. పైడిస్వామి అనే నాదస్వరం విద్వాంసుడి వద్ద సంగీతం నేర్చుకున్నప్పటికీ, ఆమె శాస్త్రీయ సంగీతంలో ఎప్పుడూ అధికారిక శిక్షణ తీసుకోలేదు.
ఇక, 1959లో జానకి వి. రామప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన ఆమె కెరీర్‌కు ఎంతో మద్దతుగా నిలిచారు. ఆమె చాలా రికార్డింగ్ సెషన్లకు ఆమెతో పాటు వెళ్లేవారు. గుండెపోటు కారణంగా ఆయన 1997లో మరణించారు.

