నాగబంధం బాక్స్ ఆఫీస్ : కంటెంట్ లేకుండా ఎంత బడ్జెట్ ని ఖర్చు పెట్టిన బూడిదలో పోసిన పన్నీరే అని రీసెంట్ గా విడుదలైన ‘నాగ బంధం’ చిత్రం ఒక క్లాసిక్ ఉదాహరణగా నిలిచింది. విడుదలకు ముందు ఈ సినిమా మేకర్స్ చేసిన సౌండ్ మామూలుది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఈవెంట్స్ ని నిర్వహించి , సినిమా పై బజ్ ని పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రేంజ్ లో లేపుతున్నారంటే , కచ్చితంగా సినిమాలో విషయం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆడియన్స్ కి థియేటర్స్ లో ఈ చిత్రం టార్చర్ చూపించింది. థియేటర్స్ లో నిద్రపోతూ కొంతమంది నెటిజెన్స్ పెట్టిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 8 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారిగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతంలో ఈ చిత్రం 8 రోజుల్లో దాదాపుగా 7 కోట్ల 65 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వాచినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది డీసెంట్ వసూళ్లే అయినా, ఈ సినిమా బడ్జెట్ రీకవరీ కి ఇది ఏ మాత్రం సరిపోదు అని చెప్పాలి. ఇక ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రం 13 కోట్ల 65 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు , 6 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 2 కోట్ల 30 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 60 లక్షలు, ఓవర్సీస్ నుండి 1 కోటి 75 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు ఈ రికార్డు నమోదు అయ్యాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 21 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు , 9 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
100 కోట్ల బడ్జెట్ ఎక్కడ , 10 కోట్ల షేర్ ఎక్కడ చెప్పండి. ఈ వీకెండ్ కూడా వసూళ్లు రీకవరీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ‘లెనిన్’ మేనియా నడుస్తోంది. ఈ సినిమా టిక్కెట్లు దొరకని వాళ్ళు ‘నాగబంధం’ థియేటర్స్ వైపు వెళ్లాల్సిందే కానీ , ఈ చిత్రానికి సంబంధించిన భారీ రికవరీ వచ్చే అవకాశాలు లేవు. కానీ ఒక కొత్త హీరో సినిమాకు , డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు కావడం సాధారణ విషయం కాదు. టాక్ వచ్చి కోట్లలో ఉంటే ఈ చిత్రం 100 గ్రాస్ ని కూడా అందుకునేదేమో అని సోషల్ మీడియా లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

