జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-–5 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గనిలో డ్యూటీ చేస్తున్న జనరల్ అసిస్టెంట్ పృథ్వీపై ప్రమాదవశాత్తు పైపు పడడంతో గాయాలైనట్లు అధికారులు తెలిపారు. తోటి కార్మికులు 108లో ఆసుపత్రికి. గని అధికారులు హాస్పిటల్ కు చేరుకొని కార్మికుడిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

