తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు ఆమెకు ఇక్కడ హిట్టే లేదు. అయినా సరే అవకాశాలకైతే లోటు లేదు. తొలి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత చేసిన కింగ్డం, ఆంధ్రా కింగ్ తాలూకా కూడా నిరాశపరిచినా.. తమిళంలో నటించిన ‘కాంత’ కూడా ఫ్లాప్ అయినా.. ఆమెకే అవకాశాలు వచ్చాయి.
ఇలాంటి టైంలో ‘లెనిన్’ సినిమా ఆమెకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ చిత్రం భాగ్యశ్రీ కోరుకున్న విజయాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సక్సెస్ మీట్లో ఆమె ఎంత ఎమోషనల్ అయిందో తెలుసా. హిట్ లేనపుడే భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు. ఇక ఆ లోటు కూడా తీరిందంటే ఆమె మరింతగా దూసుకెళ్లడం ఖాయం.
ఇదిలా ఉండగా ‘లెనిన్’ సక్సెస్ నేపథ్యంలో ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న భాగ్యశ్రీ.. సినీ రంగంలోకి రావడానికి ముందు తన నేపథ్యం, కుటుంబ విషయాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. భాగ్యశ్రీని చూస్తే బాగా రిచ్ అనిపిస్తుంది కానీ.. చిన్నతనంలో ఆమెది సాధారణ మధ్య తరగతి కుటుంబమట. అలాంటి కుటుంబాల్లో ఉండే ఆర్థిక ఇబ్బందులను తానూ అనుభవించినట్లు ఆమె చెప్పింది. తమది మహారాష్ట్ర అని.. తాను పుట్టిన కొంత కాలానికే తండ్రి ఉద్యోగం పోయినట్లు ఆమె.
తనకు ఇద్దరు కూతుళ్లున్నారని, ఏదైనా జాబ్ ఇప్పించమని తన తండ్రి చాలామందిని అడగడం తనకు ఉందని ఆమె చెప్పింది. అది చూశాకయ్యా తాను బాగా డబ్బులు సంపాదించి తండ్రికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అనుకున్నట్లు భాగ్యశ్రీ పెద్దగా గుర్తించాడు. కొన్నేళ్ల తర్వా తన తండ్రికి నైజీరియాలో ఉద్యోగం వచ్చిందని.. తన కుటుంబం అక్కడికి వెళ్లామని.. అప్పుడు తనకు మరాఠీ తప్ప ఇంగ్లిష్ రాదని.. దీంతో అక్కడున్న ఎన్నారైలు బాగా ఏడిపించేవారని.

