లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత బ్యాటర్ యస్తికా భాటియా అదరగొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిపోయింది. 145 బంతుల్లో మూడంకెల మార్క్‌ను అందుకుంది. లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి మహిళ క్రికెటర్‌గా యస్తికా ఘనత. కాగా, 158 బంతులు ఎదురుకున్న యస్తికా 14 ఫోర్లతో 113 పరుగులు చేసి ఔట్ అయింది.
కాగా, ఈ మ్యాచ్ తొలి మ్యాచ్‌లో భారత్ 285, ఇంగ్లండ్ 170 పరుగులు చేసి ఆలౌట్ అయ్యాయి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 79 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిచా ఘోష్(31), సయాలీ సత్గరే (1) ఉన్నారు.

