టాలీవుడ్ బ్యూటీ సమంత ఫుల్ జోష్ లో ఉంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. జూన్ 19, 2026న విడుదలైన ఈ మూవీ .. 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లను రాబట్టింది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా అరుదైన భారీ రికార్డును సమంత సొంతం చేసుకుంది.
రూ. 100 కోట్ల క్లబ్‌లోకి…
ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సందర్భంగా సమంత తెగ సంబరపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ఒకవైపు త్వరలోనే తల్లి కాబోతుండటం.. మరో వైపు తన మూవీ గ్రాండ్ సక్సెస్ తో ఫుల్ ఖుషిలో ఉంది. ఇప్పుడు థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ యాక్షన్ డ్రామా, ఓటీటీ ప్రియులను అలరించేందుకు డిజిటల్ స్క్రీన్‌పైకి వస్తోంది. మేకర్స్ ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో అటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మా బంగారం @సమంతప్రభు2100 కోట్లకు ప్రతిస్పందనగా ఉంది ❤️#మాఇంటిబంగారం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది
ఈ మైలురాయిని చేరిన మొట్టమొదటి మహిళా నాయకత్వ తెలుగు సినిమా ❤🔥
ఓవర్సీస్ ద్వారా @ప్రత్యంగిరUS pic.twitter.com/ur5nD9SWyo
— ప్రత్యంగిరా సినిమాస్ (@PrathyangiraUS) జూలై 12, 2026
జియోహాట్‌స్టార్‌లో హంగామా..
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) భారీ ధరకే సొంతం చేసుకుంది. జూలై 17, 2026 నుంచి ఈ చిత్రం అఫీషియల్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ సంస్థ. ప్రస్తుతానికి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ప్రీమియర్‌కు లాక్ చేయబడింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన ఘన విజయం చూస్తుంటే.. త్వరలోనే మిగిలిన దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.
బాక్సాఫీస్ దాటి.. ఓటీటీలోకి!
సమంత తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మించిన ఈ చిత్రం తన భర్త, బాలీవుడ్ క్రియేటివ్ మైండ్స్ రాజ్ నిడిమోరు కథను అందించగా, నందినీ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను, ముఖ్యంగా ఇంటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ‘మా బంగారం’.. ఇప్పుడు ఇంట్లోనే చూసేందుకు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ల అమ్మకాలతో ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతున్న ఈ సినిమా, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎలాంటి వ్యూస్ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
జూలై 17
ఒకొక్కోడ్ని కొడతాము చూడు… ప్రేమతో అబ్బా ❤️🔥#మాఇంటిబంగారం JioHotstarలో జూలై 17 నుండి స్ట్రీమింగ్! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@సమంతప్రభు2 @ట్రలాలా పిక్చర్స్ #రాజ్నిడిమోరు #నందినిరెడ్డి @himankd @గుల్శాందేవయ్య @దిగంత్మాంచలే @గౌతమితాడ్స్… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar తెలుగు (@JioHotstarTel_) జూలై 12, 2026

