గత కొంతకాలంగా యంగ్ హీరో రామ్ పోతినేని ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే తో ప్రేమాయణం నడుపుతున్నారు , ప్రస్తుతం డేటింగ్ లో ఈ క్యూట్ కపుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు , అదే విధంగా రూమర్స్ అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి రామ్ పోతినేని ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ , భాగ్యశ్రీ భోర్సే మాత్రం రీసెంట్ గా అభిమానులతో జరిగిన ఒక సంభాషణలో రామ్ గురించి చెప్పుకొచ్చింది. రామ్ టాపిక్ వచ్చినప్పుడల్లా , ఆమె సిగ్గు పడే విధానం చూస్తే చెప్పేయొచ్చు , వీళ్లిద్దరు కచ్చితంగా రిలేషన్ లోనే ఉన్నారనే విషయం. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు భాగ్యశ్రీ ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఒక అభిమాని భాగ్యశ్రీ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ జీవితం లో మంచి థెరఫిస్ట్ ‘ ఎవరు అని అడగ్గా, భాగ్యశ్రీ క్షణం కూడా ఆలోచించకుండా రామ్ పోతినేని అని చెప్పుకొచ్చింది. థెరఫిస్ట్ అంటే డాక్టర్ అనుకునేరు , అన్ని విధాలుగా తోడు ఉంటూ , సరైన సూచనలు ఇచ్చి, మనోధైర్యం నింపే వాళ్లనే థెరఫిస్ట్ అంటారు. మన జీవితంలో మన తల్లిదండ్రులు ఈ స్థానంలో ఉండొచ్చు , అదే మన జీవిత భాగస్వాములు కూడా ఉండొచ్చు. భాగ్యశ్రీ రామ్ ని థెరఫిస్ట్ అంటాయ్ సంబోధించిందంటే కచ్చితంగా పరోక్షంగా తనతో ఉన్న రిలేషన్ ని చెప్పకనే చెప్తానని సమాచారం. అభిమానులు అంతే కాకుండా మీ కో ఆర్టిస్టులతో ఎవరితో స్నేహం చేస్తారు , ఎవరితో డేటింగ్ చేస్తారు , ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్న అడుగుతారు.
అందుకు భాగ్యశ్రీ సమాధానం చెప్తూ ‘నాతో కలిసి నటించిన హీరోలందరికీ దాదాపు పెళ్లిళ్లు అయిపోయాయి , ఒకే ఒక్క హీరో కి అవ్వలేదు (సిగ్గుతో నవ్వుతూ)’ అంటూ చెప్పుకొచ్చారు. అలా క్లూలు ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఈ జంట కూడా విజయ్ దేవరకొండ, రష్మిక జంట లాగానే ఫ్యాన్స్ , ఆడియన్స్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. లేకపోతే లేటెస్ట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘లెనిన్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఆమె కెరీర్లో ఇదే మొట్టమొదటి సూపర్ హిట్ అనుకోవచ్చు.

