మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్లు. ఈ సోమవారం రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు. హారర్,కామెడీ, థ్రిల్‌ని కలగలిపి మేర్లపాక గాంధీ ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. వరుణ్ తేజ్, సత్యల కాంబినేషన్లో మంచి కామెడీ సీన్ ఉంటాయని. ఇక వరుణ్ తేజ్‌ని ఆత్మ ఆవహించడం.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.

