సుమలత: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత స్పష్టం చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సుమలత మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 35 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అసోసియేషన్‌ను నడిపించడం అంత సులభం కాదని, ఏ విషయం జరిగినా బాధ్యత అధ్యక్షురాలుపైనే ఉంటుందని ఆమె తెలిపారు. అయితే ప్రస్తుతం కార్యవర్గ సభ్యులంతా ఐక్యంగా పనిచేస్తున్నారని, ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు లేదా గొడవలు లేవని పేర్కొన్నారు. మాజీ కార్యవర్గంలో చోటుచేసుకున్న కొన్ని అక్రమాల కారణంగా ప్రస్తుతం పరిస్థితులు ఏర్పడ్డాయని సుమలత. కొందరు ఇన్చార్జీలు నిర్మాతల నుంచి ఒక మొత్తం తీసుకుని, అసోసియేషన్ రికార్డుల్లో మరో మొత్తం నమోదు సమాచారం. ఈ వ్యవహారం వల్ల డాన్సర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని, దానిని ప్రశ్నించిన అనంతరం సంబంధిత నిర్ణయానికి సంబంధించిన వ్యక్తులను సస్పెండ్ చేసింది.
అవినీతికి పాల్పడిన ఇద్దరికి మద్దతుగా మరికొందరు రాజీనామా చేశారు, అనంతరం కొత్త ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ సభ్యులు పూర్తి ఎన్నికలకు కాకుండా, రాజీనామా చేసిన స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. ఫెడరేషన్ మొత్తం కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది, అలాంటి నిబంధన అసోసియేషన్ బై లాస్లో లేదని సుమలత స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన రహస్య ఓటింగ్‌లో కూడా రాజీనామా చేసిన పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు మెజారిటీగా అభిప్రాయపడ్డారు. తమ పదవీకాలం ఇంకా కొనసాగుతోందని, ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం లేదని, ఫెడరేషన్తో కలిసి పనిచేయడానికే తాము కట్టుబడి ఉన్నామని సుమలత పేర్కొన్నారు.

