త్వరలో టెలికామ్ కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని. 10 శాతం 15 శాతం వరకు ప్లాన్ల ధరలు పెరుగుతాయని ఓ నివేదిక తాజాగా. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం టెలికామ్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాయని.. అందుకే రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. బీఎస్ఎల్ లో మిగిలిన వాటికంటే.. తక్కువగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఎక్కువ రోజులు వ్యాలిటిడీ, డేటా కూడా ఎక్కువగా వాడేవారికి, అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా కావాలనుకునేవారికి BSNL ఓ ప్లాన్ తీసుకొచ్చింది.
ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.599 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిట్ కాలింగ్, డేటా, ఫ్రీఎంఎస్ కూడా వస్తాయి. ఈ రూ.599తో రీఛార్జ్ చేసుకుంటే.. 70 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దీంతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజుకు 3GB హై-స్పీడ్ డేటా వస్తుంది. ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి ఇది చాలా ఉంటుంది. ఒకవేళ మీ డైలీ 3GB పరిమితి డేటా అయిపోయినా ఇంటర్నెట్ కట్ అవ్వదు. కాకపోతే స్పీడ్ కొద్దిగా తగ్గి 40 Kbpsకి పడిపోతుంది.
ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఏ నెట్‌వర్క్‌కైనా ఎంతసేపైనా ఉచితంగా దేశంలో మాట్లాడుకోవచ్చు. ఆన్ లిమిట్ కాలింగ్, డేటాతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు (SMS) కూడా లభిస్తాయి. ఎక్కువగా యూట్యూబ్ చూసేవారు, ఓటీటీల్లో సినిమాలు చూసే వారు, ఎక్కువగా రీల్స్ చూసేవారికి ఈ ప్లాన్ సెట్ అవుతుంది. ఇదే డేటాతో ఇతర నెట్ వర్కుల్లో రీఛార్జ్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త ఎక్కువ రోజులు వాలిడిటీ వచ్చే ప్లాన్ కావాలనుకునే వారికి రూ.599 ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
టెలికాం కంపెనీలు ప్లాన్ల ధరలను, ఆఫర్లను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు రీఛార్జ్ చేసుకునే ముందు ఒకసారి BSNL అధికారిక వెబ్సైట్ లేదా ‘సెల్ఫ్‌కేర్’ (BSNL సెల్ఫ్‌కేర్) యాప్‌లో మీ నంబర్‌కు ఈ ప్లాన్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీ ప్రాంతంలో BSNL సిగ్నల్స్ ఉంటే, ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సైట్లు మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కానీ, ఆమోదించడం కానీ బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించడం. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

