బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగు నెలల తరువాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతం కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్వేత అనే యువతి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. సుంకదకట్టేలోని ఓ బాడుగ ఇంట్లో తన భర్తతో కలిసి ఉంటుంది. శ్వేత నాలుగు నెలల క్రితం తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంది. తన చావుకు భర్త, అతడి చెల్లెలు అని సూసైడ్ నోట్లో రాసి శ్వేత ప్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. ‘నేను చనిపోతే, వాళ్లకు శిక్ష పడకుండా వదిలేయొద్దు అమ్మ, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు’ అని సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. భర్త, అతడి చెల్లెలును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

