ఢిల్లీ: రాష్ట్రాల అభివృద్ధిలోనూ విమానాశ్రయాల పాత్రను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వరంగల్ విమానాశ్రయ భూసేకరణకు రేవంత్ రెడ్డి చొరవ చూపించారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ, త్వరగా మామునూరు ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని, మూడు వారాల్లో పనులు ప్రారంభించాలని అన్నారు. 253 ఎకరాలు ఎయిర్ పోర్టు అథారిటీకి ఇచ్చారని, మూడు, నాలుగు వారాల్లో టెండర్లు జరుగుతాయని అన్నారు. 2028 జూన్ 2 నాటికి పనులు పూర్తి కావాలి సిఎం రేవంత్ రెడ్డి కోరారని, తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు రావాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ తెలియజేశారు.
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నామని, ఆదిలాబాద్ లో రక్షణశాఖ భూముల వ్యవహారం తేలాక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి ఆదిలాబాద్ విమానాశ్రయం పూర్తి, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు తమ శాఖ నుంచి పూర్తి మద్దతిస్తామని రామ్మోహన్ పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి రద్దీ బాగా పెరుగుతోందని, మరో వంద విమానాశ్రయాలు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు. వరంగల్ ప్రాంత ప్రజలకు అద్భుతమైన విమానాశ్రయం వస్తుందని, కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ విమానాశ్రయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలాగే మిగిలిన రాష్ట్రాలు కూడా స్పందించాలని, విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయని, భూసేకరణ సమస్యలు పూర్తి చేసుకుని తమ వద్దకు రావాలని కోరుతున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు.

