నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం మండలాధ్యక్షులు తుకారం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, ఆ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ఓటర్ సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు కార్యకర్తలు బీఎల్ ఓలకు సహకరిస్తారని తెలిపారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేయడం. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు తుకారాం, మండల జనరల్ సెక్రటరీ ప్రశాంత్ కుమార్, చిన్న ఎక్లర సర్పంచ్ మాధవ్ రావు, అద్వైత్ దేశపాండే, రమేష్ దేశాయి, హన్మాండ్లు,పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
పోస్ట్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్యే మొదట కనిపించింది నవతెలంగాణ.

