విశాలాంధ్ర – విడపనకల్లు: మండల పరిధిలోని పెంచలపాడు గ్రామ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు విడపనకల్లు ఎస్ఐ ఖాజా హుస్సేన్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలియజేసారు.మృతదేహం లభ్యమైన ప్రదేశం, పరిస్థితులను పరిశీలించినప్పుడు సహజ మరణంగా ప్రాథమికంగా ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, వృద్ధాప్యం, అనారోగ్యం లేదా సకాలంలో అన్నపానీయాలు లభించక మృతి చెందినట్లు అనుమానిస్తున్నట్లు గుర్తించారు. మృతుడి పేరు, స్వస్థలం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.గత నాలుగు రోజులుగా ఆ వృద్ధుడు పెంచలపాడు గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ రోడ్ల పక్కన పడి ఉన్న ఖాళీ నీళ్ల బాటిళ్లు, వాటి మూతలను ఏరుకుని సంచిలో వేసుకునేవాడని తెలిసింది.
పోస్ట్ పెంచలపాడు సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం మొదట కనిపించింది విశాలాంధ్ర.

