నెల్లూరు : నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తిరిగి నెల్లూరు పట్టణ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు.
నెల్లూరు : నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తిరిగి నెల్లూరు పట్టణ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. మంత్రి నారాయణను ఢీకొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి నెల్లూరుకు దూరంగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2014, 2019 ఎన్నికలలో నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రిగా కూడా పనిచేశారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా చేరిన అనిల్ కుమార్ యాదవ్ తొలి విడత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
సొంత పార్టీలోనే శత్రువులు…
మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలవడంతో అక్కడ టిడిపి పట్టు బిగిస్తోంది. అయినా వైసీపీ నేతగా, మాజీ మంత్రిగా పార్టీకి పూర్వవైభవం తేవాలన్న ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ చేయకపోవడాన్ని మొన్నటి వరకూ పార్టీ నేతలే చర్చించుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. అదే ఆయన మంత్రి కావడానికి ప్రధాన కారణమైంది. కానీ సొంత నియోజకవర్గంలోనే మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ సొంత పార్టీలోనే ప్రత్యర్థుల సంఖ్యను కూడా పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పట్టణ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వకుండా నరసరావుపేట పార్లమెంటుకు పంపారు.
మరోసారి నెల్లూరులో…
మొన్నటి ఎన్నికలలో ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మిగిలిన మౌనంగానే ఉన్నారు. సహజంగా దూకుడుగా ఉంటే అనిల్ ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రస్తుతం నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గానికి పెద్దగా అనిల్ కుమార్ యాదవ్ రావడం లేదు. నెల్లూరు పట్టణ నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రాథమికంగా SIR ప్రక్రియ జరుగుతుండటంతో తమ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించకుండా దగ్గరుండి అన్నిచర్యలు తీసుకుంటున్నారు. వచ్చేనెల్లూరు టౌన్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమైన కుమార్ యాదవ్. జగన్ నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. దీంతో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోనే ఉంటూ అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరి మంత్రి నారాయణను ఢీకొట్టగల శక్తి అనిల్ కుమార్ యాదవ్ ఉంటుందా? లేదా? అన్నది వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలియనుంది.
వార్తల సారాంశం – వైఎస్సార్సీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు వైపు దృష్టి సారించారు

