హైదరాబాద్ : మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు.
హైదరాబాద్: మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఇటీవల దేవాదాయ శాఖకు చెందిన అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడాన్ని ముఖ్యమంత్రికి కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
కడియం శ్రీహరిపై…
మంత్రితో సంబంధం లేకుండా అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడాన్ని మంత్రి కొండా సురేఖ తప్పు పట్టారు. అయితే మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారు. అయితే సంయమనం పాటించాలని మీనాక్షి సూచించారు. చిన్నచిన్న విషయాలను పట్టించుకోవద్దని సురేఖకు మీనాక్షి సూచించారు.
వార్తల సారాంశం – మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు

