సామ్సంగ్ తన తదుపరి ఫ్లాగ్షిప్ టాబ్లెట్ గెలాక్సీ టాబ్ S12+ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌కు తాజాగా కొత్త సేఫ్టీ సర్టిఫికేషన్ లభించడంతో పాటు, దీని ఫస్ట్ లుక్ కూడా ఆన్లైన్లో లీక్ అయింది. దీనితో గెలాక్సీ టాబ్ S12+పై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ప్రముఖ టిప్‌స్టర్ @sammygurus వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ సిరీస్‌లో గెలాక్సీ టాబ్ S12+తో పాటు గెలాక్సీ టాబ్ S12+ అల్ట్రా మోడల్‌ను కూడా సామ్సంగ్ విడుదల చేసే అవకాశం ఉంది. గెలాక్సీ టాబ్ S12+ వై-ఫై వేరియంట్‌కు SM-X840 మోడల్ నంబర్ ఉండగా, 5G వేరియంట్‌కు SM-X846N మోడల్ నంబర్ ఉన్నట్లు సమాచారం. ఈ రెండు మోడళ్లకూ దక్షిణ కొరియాలో సేఫ్టీ సర్టిఫికేషన్ లభించింది.
లీకైన చిత్రాల ప్రకారం..గెలాక్సీ టాబ్ S12+ ఫ్రంట్ డిజైన్ ఆకట్టుకునేలా మారింది. ఇందులో ఫ్రంట్ కెమెరాను డిస్ప్లే బెజెల్‌లోనే అమర్చినట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కెమెరా రిజల్యూషన్ లేదా ఇతర కెమెరా ఫీచర్లపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టాబ్లెట్‌లో 3 నానోమీటర్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఫ్లాగ్షిప్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. అలాగే సుమారు 14.6 పెద్ద డిస్ప్లేను అందించే అవకాశం ఉంది.
బ్యాటరీ విషయంలో కూడా గెలాక్సీ టాబ్ S12+ ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇందులో 11,600mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు సమాచారం. దీనితో ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీకుల ప్రకారం..గెలాక్సీ టాబ్ S12+ను 2026 సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొత్త Galaxy S26’కు చెందిన మోడళ్లను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని టెక్ సిరీస్‌లు కోరుతున్నాయి.

