– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ :హర్మూజ్‌లో క్షిపణి దాడికి గురైన నౌకలోని భారతీయ నావికుడు హేరంబ్ కర్మార్కర్ మరణించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఇరాన్ దాడి చేసినప్పుడు, ఆ సరకు నౌకలోని 11 మంది భారతీయుల్లో కర్మార్కర్ ఒకరు. నౌక ఆదివారం రాత్రి 2.49 గంటలకు హర్మూజ్‌ను దాటుతుండగా హేరంబ్ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు. కొద్దిసేపటికే నౌకపై క్షిపణి పడి హేరంబ్ మృతి చెందడం అందరినీ కలచివేస్తుంది.
– ప్రకటన –

