నారాయణపేట జిల్లాలో గురుకుల కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో గురుకుల కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్దూర్ వారి కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఉట్కూర్ వారి ఓ గ్రామానికి చెందిన బాలిక తమ సమీప యువకుడు ఆమెను కలిసేందుకు రెండు రోజుల కింద కేజీబీవీ వద్దకు వచ్చాడు. కేజీబీవీ సిబ్బంది అతడితో బయట నుంచి మాట్లాడేందుకు అనుమతించారు.
ఇదే సమయంలో అనుమానం వచ్చి యువకుడి గురించి తెలుసుకునేందుకు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన బాలిక తల్లిదండ్రులు యువకుడి గురించి ఆరా తీసేందుకు తమ కూతురిని పిలిపించుకున్నారు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు పోతుందనే భయంతో పాఠశాల భవనం రెండో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, తీవ్ర గాయాలపాలైన బాలిక దవాఖానలో చికిత్స పొందుతోంది.

