అగ్ని ప్రమాదం: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో బార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చాయి. ప్లాస్టిక్ సామగ్రి అందడంతో మంటలు వేగంగా వ్యాపించి, పక్కనే ఉన్న మరో గోదాంతో పాటు సమీపంలోని భవనాలకు కూడా అంటుకున్నాయి. అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ లేదా ఇతర కారణాలతో మంటలు చెలరేగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అసలు కారణం దర్యాప్తు తర్వాత వెల్లడికానుంది. ఘటనపై మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

