బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ దశకంలో రీనాదత్తాను పెళ్లాడిన అమీర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు. తర్వాత 2005లో కిరణ్ రావుతో ఆయనకు వివాహం జరిగింది. ఆమె నుంచి 2021లో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ అనే బెంగళూరు మహిళతో ఆయనకు వివాహం జరిగింది.
ఈ పెళ్లిలో రీనా, కిరణ్‌లతో పాటు వారితో అమీర్ ఖాన్‌కు కలిగిన పిల్లలు కూడా ఉన్నాయి. ఐతే ముస్లిం అయిన అమీర్.. హిందూ మహిళా మహిళలను పెళ్లి చేసుకుని వదిలేయడం అలవాటుగా మార్చుకున్నాడని.. ఇది లవ్ జిహాదే అని ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితీశ్ రాణే ఇదే కామెంట్ చేశారు. ఆమిర్ తాజాగా స్పందించారు.
తన వివాహాలు ఎంతమాత్రం లవ్ జిహాద్లో భాగం కాదని అమీర్ అన్నాడు. తన భార్యల్లో ఎవ్వరూ ఇస్లాం మతంలోకి మారలేదని ఆయన స్పష్టం చేశారు. రీనా, కిరణ్ ఇద్దరూ పెళ్లి తర్వాత కూడా హిందూ మతంలోనే కొనసాగరన్నాడు. ఇక గౌరీ గురించి వివరిస్తూ.. ఆమె అసలు హిందువే కాదని, క్రిస్టియన్ అని అమీర్ వెల్లడించాడు. ఆమె అసలు మతాచారాలను పాటించదని అన్నాడు.
తనది ఎంతో విశాల దృక్పథం ఉన్న కుటుంబం అని.. తన ఇద్దరు సోదరీమణులు హిందువులను పెళ్లి చేసుకున్నారని.. తన కుమార్తె కూడా హిందువునే పెళ్లాడిందని.. తన కజిన్ మన్సూర్ క్రిస్టియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని అమీర్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. గౌరీ ఇస్లాం మతంలోకి మారలేదు కాబట్టి అమీర్ మూడో పెళ్లి చెల్లంటూ ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేయడం గమనార్హం. ఆమిర్ ఏమీ స్పందించలేదు.

