చెన్నై: “ఎవరైనా మీ దగ్గర లంచం అడిగితే, ఇవ్వనని వాళ్లకు మొఖం మీదే సూటిగా చెప్పండి. నేను మీకు అండగా ఉంటాను. ఆ తర్వాత కూడా ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తే.. ‘ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది మా బిడ్డ, మా సోదరుడు, మా విజయ్’ అని లంచం అడిగిన వాళ్లకు గట్టిగా చెప్పండి,” అని తమిళనాడు సీఎం ఇటీవల సభలో మాట్లాడిన మాటలకు హర్షధ్వానాలు, చప్పట్ల మోత మోగింది.
#చూడండి | లంచాలు, అవినీతికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం విజయ్ చేసిన సాహసోపేత ప్రకటన వైరల్‌గా మారింది pic.twitter.com/1jIR480RTT
— మింట్ (@లైవ్‌మింట్) జూలై 14, 2026
అయితే.. లంచగొండితనానికి వ్యతిరేకంగా విజయ్ ఇంత గట్టిగా నిలబడితే కొందరు TVK నాయకులు మాత్రం విజయ్ హెచ్చరికను పట్టించుకోకుండా లంచం తీసుకుని దొరికిపోయారు.
ప్రభుత్వ కాంట్రాక్టర్ నుంచి రూ. 1.3 లక్షల లంచం తీసుకున్న ఆరోపణలతో టీవీకే నాయకుడు వీర వీరస్వామి వీడియో వైరల్ అయింది. చెంగల్పట్టు తూర్పు జిల్లా సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న వీరస్వామి లంచం తీసుకున్న ఘటనకు సంబంధించి వీడియోతో ఆధారాలు బయటపడ్డాయి. దీంతో.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తమిళగ వెట్రి కజగం అధిష్టానం అతని పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
తవేక ఇంచక్పట్టు తూర్పు జిల్లా ఇని సెక్రటరీ వీరా అనే వ్యక్తి, ప్రభుత్వ ఒప్పందదారుడికి రూ.1.30 లక్షల లంచ్‌లు కొనుగోలు చేసిన వీడియో, తవేక-విన్ నిజ ముఖాన్ని విస్తృతం చేస్తున్నట్లు ఉంది.
ప్రజలు డబ్బును కొనసాగిస్తాము, ఎందుకంటే ధూయ శక్తి యజమాని తిరు. @TVKVijayHQ వారు… pic.twitter.com/sT1JvQGjeC
— వినోజ్ పి సెల్వం (@VinojBJP) జూలై 14, 2026
తమిళనాడు బీజేపీ నాయకుడు వినోద్ పి సెల్వం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీవీకే పార్టీ ముసుగు అధికారం కప్పుకుని లంచగొండితనం అరికడతాడమని ప్రగల్భాలు పలుకుతూ చాటుమాటుగా లంచాలు మేస్తుందని తమిళనాడు బీజేపీ ఆరోపించింది.
►ఇంకా చదవండి | గవర్నమెంట్ బడిలో టీచర్లు.. క్లాస్ రూంలో ఏం పనులివి.. మాస్టారు భార్య స్కెచ్‌కు దొరికారు !

