హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. రెండు మూడు వారాల క్రితం వరకు గుడ్ల ధరలు ఒక్కోటి రూ. 6 నుంచి రూ. 7 మధ్య ఉండేవి. ఇప్పుడు ఒక్కో గుడ్డు ధర రూ. 8 నుంచి రూ. 8.50 వరకు పెరిగింది. కోడి గుడ్లు ఫుడ్ కావడంతో కొనక తప్పడం లేదు.
ఇళ్లలో కోడి గుడ్లు వాడేటోళ్లకే కాదు.. గుడ్లపై కొత్త బేకరీలు, హోటల్స్పై కూడా కోడి గుడ్లు పెరగడంతో తీవ్ర ప్రభావం పడింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ స్థిరంగా ఉండటంతో.. గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో ఎగ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. హైదరాబాద్ సిటీలో సాధారణంగా రోజుకు 80 లక్షల కోడిగుడ్ల వాడకం కొనసాగుతోంది, ప్రస్తుతం కోటి దాటింది.
►ఇంకా చదవండి | పోక్సో కేసులో జగిత్యాల కోర్టు సంచలన తీర్పు… ఐదుగురికి జీవిత ఖైదు..
గుడ్డు పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచించడంతో వీటి వినియోగం పెరిగింది. కోడిగుడ్డును ప్రజలు తమ రోజువారీ మెనూలో ఆహారంగా తీసుకుంటున్నారు.చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు గుడ్లు , అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి చిన్నారులకు రోజుకో గుడ్డు, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు ఆహారంలో రోజుకో గుడ్డు తప్పనిసరి చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే రోజుకు కోటి కోడి గుడ్లను వినియోగిస్తుండగా.. తెలంగాణ మొత్తం రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య 3 కోట్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే దేశంలో రోజుకు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల ఎగ్స్ ప్రొడక్షన్ ఉండటం విశేషం.

