అఖిల్ ఫ్యాన్: ‘అయ్యగారే నెంబర్ 1’ అనే డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అఖిల్ ని ఉద్దేశించి ఒక వీరాభిమాని థియేటర్ ముందు చేసిన స్లోగన్ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే అఖిల్ కంటే ఈ వీరాభిమానినే బాగా ఫేమస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఈ స్వయంగా అఖిల్ ఒక ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నారు. కచ్చితంగా ఇతన్ని ఒకరోజు కలవాలి , కానీ ఇలా మాత్రం కాదు ,ఒక భారీ బ్లాక్ బస్టర్ కొట్టాకే కలుస్తాను అని అనేవారు అఖిల్. రీసెంట్ గా ‘లెనిన్’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సందర్భంగా అఖిల్ ఈ అభిమానిని నిన్న గుంటూరులో కలిశారు. అఖిల్ ని చూడగానే ఈ అభిమాని ఆనందం, ఉత్సాహం చూస్తే ఎలాంటి వారికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ‘లెనిన్’ విజయోత్సవ సభ గుంటూరులో చాలా గ్రాండ్ గా జరిగింది. నిజానికి ఈ సినిమా విజయోత్సవ సభ గుంటూరులో జరగడానికి ప్రధాన కారణం , అఖిల్ ఈ అభిమానిని కలవడం కోసమే అట. ఎట్టకేలకు మూవీ టీం ఇతన్ని అఖిల్ క్యారవ్యాన్ దగ్గరకు తీసుకెళ్లారు. అఖిల్ ని చూడగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చేసిన ఈ అభిమానిని చూసి ‘ఇప్పుడు హ్యాపీ నా?’ అని అడుగుతారు అఖిల్. ‘చాలా సంతోషం అయ్యా.. మీరు ఇది కాదు , రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద రేంజ్ కి రావాలి’ అని ఎమోషనల్ గా ఈ అభిమాని చెప్పిన మాటలకు ‘కచ్చితంగా అందం’ అంటూ అఖిల్ సమాధానం ఇవ్వడం , ఆ తర్వాత ఈ అభిమానిని తన భార్య కి పరిచయం చేయడం బాగా హైలైట్ అయ్యాయి.
ఇది చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి కలిగే ఫీలింగ్ ఏంటంటే, ఇలాంటి అభిమాని ప్రతీ హీరోకి ఉండాలి. ఇతను తన అభిమాన హీరో నుండి ఎలాంటి సహాయం కోరడం లేదు. కటికలో ఉన్నాడు , కనీసం పేద మొబైల్ ఫోన్ కూడా ఇతనికి లేదు. అతను కోరిందల్లా అఖిల్ బాబు ఒక్క హిట్ కొట్టాలి అంటే. ఆ కోరిక నెరవేరడం తో ఇతనికి తన జీవితం లో ఎదో గొప్ప విజయాన్ని సాధించిన ఫీలింగ్ కలిగింది. అతను ఎలాంటి సహాయం కోరలేదు కానీ , ఈ పేద అభిమానిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం అక్కినేని ఫ్యామిలీ కి ఎంతైనా ఉంది. ఇతనికి ఇంటికి కనీసం కరెంటు కూడా లేదట. మరి అక్కినేని ఫ్యామిలీ ఇతన్ని ఎంత వరకు ఆదుకుంటారో చూడాలి.
అత్యంత ప్రసిద్ధ “అయ్యగారే”…
చివరగా తనకు ఇష్టమైన “అయ్యగారు” కలిశారు. ❤️ప్రతి వేడుక విలువైన క్షణం… మరియు ఇది చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది @అఖిల్ అక్కినేని8 #నాగరాజు#లెనిన్ #బ్లాక్ బస్టర్ లెనిన్ pic.twitter.com/HFejwxbew7
— అన్నపూర్ణ స్టూడియోస్ (@AnnapurnaStdios) జూలై 15, 2026

