గుంటూరు: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఎట్టకేలకు అఖిల్‌కి హిట్ పడడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందరికంటే ఎక్కువగా ‘అయ్యగారే నం.1’ అంటూ సోషల్‌మీడియాను ఒక్క డైలాగ్‌తో షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు ఇంకా ఎక్కువగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఒక్క డైలాగ్‌తో అఖిల్‌ని ఆకాశానికెత్తిన నాగరాజును అఖిల్ ఎట్టకేలకు కలిశారు. గుంటూరులో ‘లెనిన్’ సక్సెస్ మీట్ అనంతరం నాగరాజును అఖిల్ కలిశారు. ‘నీ వల్లే నాకు అయ్యగారే నం.’ అనే పేరు వచ్చింది అంటూ అఖిల్ అనగా.. నాగరాజు ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఎట్టకేలకు అయ్యగారిని కలిశాడు’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

