ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మనోళ్లు ఎన్నో సినిమాలు దీంట్లో ఎంజాయ్ చేశారు. స్క్రీన్, సౌండ్, సీటింగ్ అంతా వేరే లెవెల్ లో ఉండే ఈ ఎక్స్ పీరియన్స్ ముంబై, కోచి, బెంగళూరు లాంటి నగరాల్లో ఉంది కానీ మన దగ్గర లేకపోవడం విచారకరం. లక్కీగా వచ్చే ఏడాది భాగ్యనగర వాసులకు ఆ అదృష్టం కలగనుంది. ఇంకో రెండు అదనంగా వచ్చే అవకాశాలున్నాయి.
ఇదిలా వారణాసిని ప్రత్యేకంగా ఐమాక్స్‌లో షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం రాజమౌళి చాలా ఖరీదైన టెక్నాలజీని వాడుతున్నారు. గ్లోబల్ ఆడియన్స్ కి తాము చూస్తున్నది హాలీవుడ్ మూవీ అనిపించే స్థాయిలో ప్రతి విజువల్ ని శిల్పంలా చెక్కుతున్నారు. అయితే ఓవర్సీస్ మార్కెట్ స్క్రీన్ల పంపకాల విషయంలో రెండు హాలీవుడ్ మూవీస్ కు ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి. వాటిలో మొదటిది గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా (మార్చి 26) కాగా మరొకటి పానిక్ కేర్ ఫుల్లీ (ఏప్రిల్ 9).
వీటి మధ్యలో వారణాసి వస్తోంది. ఇంగ్లీష్ సినిమాలకు సహజంగానే అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ చైన్ల మద్దతు బలంగా ఉంటుంది. ఆరు ముందే అగ్రిమెంట్లు పూర్తి చేసుకుంటారు. హరిహరాదులు దిగి వచ్చినా వీటిలో మార్పు ఉండదు. మనలాగా చివరి నిమిషం దాకా సాగదీసి తాపీగా పోస్ట్ పోన్ చేయడం లాంటి వ్యవహారాలకు వాళ్ళు దూరం. అందుకే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే జాగ్రత్త పడమని జక్కన్న, ఎస్ఎస్ కార్తికేయలకు సూచిస్తున్నారు.
వారణాసి ఖచ్చితంగా ఏప్రిల్ 7 విడుదలయ్యే పక్షంలో ఇప్పటి నుంచే జాగ్రత్త వహించడం అవసరం. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ని మించిపోయేలా అన్ని దేశాల ప్రేక్షకులకు దీన్ని చేరవేయాలంటే ధృడ సంకల్పంతో రాజమౌళి పగలురాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. అలాంటిది హాలీవుడ్ కాంపిటీషన్ వల్ల స్క్రీన్లు తగ్గితే లేనిపోని ఇబ్బంది తలెత్తుతుంది. ఇప్పటికైతే డేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఆరు నూరైనా చెప్పిన తేదీకే వారణాసి రావడం ఖాయమని టాక్.

