వారణాసి సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా షూటింగ్ దశలోనే రిలీజ్ జరుగుతోంది, ఈ సినిమాకి సంబంధించిన థియేకల్ బిజినెస్ ఎవ్వరూ ఊహించని సినిమా. ప్రతీ ప్రాంతంలోనూ రికార్డు స్థాయి ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ. మేకర్స్ ఆశించిన స్థాయి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ఉదాహరణకు రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుందాం. మహేష్ బాబు సినిమాలకు ఈ ప్రాంతం చాలా తక్కువ వసూళ్లు వస్తాయి. ఓపెనింగ్స్ అయితే అందరి హీరోలకంటే మహేష్ కి ఇక్కడ తక్కువ ఉంటాయి. అయినప్పటికీ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో , ఈ సినిమాకు మేకర్స్ 50 కోట్ల రూపాయిలను డిమాండ్ చేస్తున్నారు.
ఒక్క సీమ ప్రాంతంలో ఈ రేంజ్ లో మేకర్స్ డిమాండ్ చేస్తున్నారంటే , ఇక నైజాం , ఓవర్సీస్ లో ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తారో ఊహించుకోవచ్చు. అయితే సీమ ప్రాంతంలో మేకర్స్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి బయ్యర్స్ సిద్ధంగా లేరట. 35 కోట్ల రూపాయిలకు అయితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు బాహుబలి 2, పుష్ప 2, దేవర చిత్రాలు మాత్రమే 30 కోట్ల షేర్ మార్కుని పొందాయి. మిగిలిన సినిమాలన్నీ 20 నుండి 25 కోట్ల మధ్యలోనే ఆగిపోయాయి. అలాంటి ప్రాంతంలో ఈ రేంజ్ డిమాండ్ చేయడం మాకు వర్కౌట్ అవ్వదని అంటున్నారట అక్కడి బయ్యర్స్. 35 కోట్లు తక్కువ నెంబర్ కాదు , ఆల్ టైం రికార్డు నెంబర్ అని చెప్పొచ్చు, కానీ అంతకు మించి డబ్బులు పెట్టడానికి ఆ పనికి బయ్యర్స్ సిద్దంగా లేరట.
మరోపక్క ఓటీటీ రైట్స్ కూడా రాజమౌళి ఆశించిన స్థాయి రేట్లు పలకడం లేదట. కేవలం ఓటీటీ రైట్స్ నుండే 1000 కోట్లు రాబట్టాలని రాజమౌళి , మూవీ టీం అనుకుంది. కానీ 450 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు సిద్ధంగా లేవు. సినిమా బడ్జెట్ దాదాపు 1400 కోట్లు అవుతోంది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 3000 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ స్టామినా కేవలం 2000 కోట్లు మాత్రమే , మరి రాజమౌళి హాలీవుడ్ లో వర్కౌట్ అవుతుంది అనే బలమైన నమ్మకం ఉంది, అందుకే చాలా ధీమాగా తన పని చేసుకుంటూ వెళ్తున్నారని , కంటెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తే , తాము కోరినంత డబ్బు ఇస్తారనే నమ్మకంతో రాజమౌళి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

