– ప్రకటన –
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని సుల్తాన్ పేట్, శాఖాపూర్ గ్రామాల శివారు పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు గురువారం పరిశీలించారు. ఈ ఎల్ నినో వాతావరణ పరిస్థితులపై స్తానిక రైతాంగానికి ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో పంటలకు సరిపడా వర్షాలు పడవని చెప్పారు. పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగు చేయడం మేలని సూచించారు. పెసర, మినుము, నువ్వులు, సజ్జలు, కూరగాయలు సాగు చేస్తే ఆశాజనక లాభాలు ఉంటాయని చెప్పారు. వరి సాగుచేసే రైతులు వర్షభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్పేట్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్, షేఖపూర్ ఉప సర్పంచ్, ఏఈవోలు విశాల్, రాజహిత గ్రామ రైతులు ఉన్నారు.
– ప్రకటన –

