దిల్ రాజు vs మైత్రీ మూవీ మేకర్స్: గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న దిల్ రాజు మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. తన జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుందని ఆయన ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ తీరుతుందనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కారణం ఏంటంటే దిల్ రాజు అంటే వ్యక్తి కాదు. ఒక బ్రాండ్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన ప్రొడ్యూసర్ గానే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా రాణిస్తూ ఉండటం విశేషం… ఇక మైత్రి మూవీస్ సైతం పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా రవి శంకర్, నవీన్ యెర్నేని ఇద్దరూ ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసి భారీ ఎత్తున సినిమాలను ప్రొడ్యూస్ చేయడం విశేషం…
ఇక వీళ్లు కూడా ప్రొడ్యూసర్ గా సక్సెస్ సాధించినప్పటికి డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కొంతవరకు నష్టాలను చవి చూశారు. దిల్ రాజుకి మైత్రి వాళ్లకు ఎలాంటి పోటీ లేకపోయిన కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడే వీళ్ళ మధ్య చాలా వరకు విభేదాలు వచ్చాయి.
ఇక ఇప్పటికే కొన్ని సార్లు వీళ్ళిద్దరు ఇన్ డైరెక్ట్ గా గొడవ కైతే దిగారు. ఒక వీళ్ళు కొన్న తర్వాత దానికి ఫ్యాన్సీ రేట్ ఇస్తామని మైత్రి వాళ్ళు దిల్ రాజు దగ్గర నుంచి కొన్ని సినిమాలను తీసుకున్నారు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి. దీని మీదనే కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి.
ఇక దీనికి చెక్ పెడుతూ ఎవరికి వాళ్లు తమ సినిమాలను సెపరేట్ గా రిలీజ్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతా? లేదంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెద్ద వివాదంగా మారే అవకాశాలు ఉన్నాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే ఈ రెండు ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి పెద్ద సినిమాలు వస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

