దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ సినిమాల డబ్బింగ్ వెర్షన్ల కోసం ఇక్కడికి వచ్చే కోలీవుడ్ ప్రముఖులందరూ ఈ మాటే అంటుంటారు. కానీ మనం ఇక్కడ తమిళ సినిమాలను నట్టిన పెట్టుకుంటుంటే.. మన సినిమాలను మాత్రం వాళ్లు పట్టించుకోరు.
బాహుబలి, పుష్ప లాంటి ఒకటి అరా సినిమాలు మినహాయిస్తే తమిళనాట తెలుగు సినిమాలు ఆడవు. బాహుబలికి ముందు రాజమౌళి నుంచి వచ్చిన మగధీర, ఈగ చిత్రాలకు కూడా తమిళంలో పెద్దగా ఆదరణ దక్కలేదు. దీని గురించి యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తరచుగా ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. మన సినిమాలకు తమిళనాట అసలు థియేటర్లే ఇవ్వకపోవడంపై గతంలో అతను స్టేజ్ మీద, ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తన కొత్త చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్న అతను.. ఇదే టాపిక్ మీద మాట్లాడాడు. సూర్య సినిమా కరుప్పుకి తెలుగులో కావాల్సినన్ని థియేటర్లు దొరికాయని, ఆ చిత్రం తెలుగులో బాగా ఆడిందని.. కానీ అఖిల్ సినిమా లెనిన్‌కు తమిళనాట థియేటర్లు అది బాగా ఆడితే, అతడికి మార్కెట్ పెరుగుతుంది కదా అని కిరణ్ అన్నాడు. మనం ఇతర భాషా చిత్రాలను ఇలా నెత్తిన పెట్టుకుంటుంటే.. మన సినిమాలకు మాత్రం ఇతర రాష్ట్రాల్లో సరిపడా థియేటర్లు ఇవ్వకపోడం ఏంటని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తన బాధని చెప్పుకుంటే.. తాము కావాలంటే తెలుగు సినిమాలకు థియేటర్లు కావాలని

