అగ్ర కథానాయకుడు ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’తో వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ సమర్పణలో రూపొందించిన ఈ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మించారు. ‘అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది..’ అంటూ పంచుకున్న కొత్త పోస్టర్లో ‘1932 నుంచి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు’ అని రాసి ఉన్న స్టాంప్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో ‘ఫౌజీ’ ప్రపంచాన్ని, సినిమా భారీ స్థాయిని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రభాస్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన లుక్ ఓ యోధుడి త్యాగం, బాధ, ధైర్యం, పట్టుదలను ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పోస్ట్ అజ్ఞాతవాసం ముగిసింది.. మొదట కనిపించింది నవతెలంగాణ.

