ఆంధ్ర ప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులపై కీలక అప్ డేట్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులపై కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులకు పరిపాలన సంబంధమైన అనుమతులను అందించింది. ఈ పథకానికి అవసరమైన 10,120 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నెల 22వ తేదీన…
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 22వ తేదీన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు వస్తాయి. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ ఈ పథకం అర్హులు. ఈ పథకం ఒక్కొక్క విద్యార్థికి ఇస్తుండగా అందులో రెండు వేలు నిర్వహణ ఖర్చుల కింద పది కింద మినహాయిస్తుంది. మొత్తం 42.70 లక్షల మంది తల్లులు ఈ పథకం కింద లబ్ది పొందనున్నారు.
వార్తల సారాంశం – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ నిధులకు సంబంధించి కీలక నవీకరణను అందించింది

