తెలంగాణ: తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్నది. కానీ నాయకత్వం లేమి పార్టీని వెనక్కు లాగుతుంది. బీజేపీ క్రౌడ్ పుల్లర్ లేకపోవడమే అసలు లోపం అని చెప్పుకోవాలి. తెలంగాణలో ఓటు బ్యాంకు పెంచుకుంటున్న దానిని పోలింగ్ బూత్ స్థాయికి తీసుకెళ్లు నాయకులు లేరు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వంటి నేత ఉన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారు. కానీ బీజేపీలో ప్రజల మైకులతో తమ వైపునకు తిప్పుకునే అగ్రనేత ఎవరనేది మాత్రం దుర్భిణి వేసి వెతికినా కనిపించారు. కిషన్ రెడ్డి వంటి వారు ఉన్నా సౌమ్యులు. బండి సంజయ్ మాట జనాలకు పెద్దగా ఎక్కదు. అలాగే లక్ష్మణ్ వంటి నేత జనాన్ని ఆకట్టుకునే నేత కాదు.
గతంలో కంటే బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశమిస్తే తప్పేముందని భావించినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. క్రమేపీ బీజేపీ తెలంగాణలో బలపడటానికి ఉన్న మోదీయే కారణమని చెప్పక తప్పదు. మరొకవైపు హిందుత్వ నినాదం కూడా కొంత మేరకు కమలం పార్టీ పెరగడానికి దోహదం చేసిందని చెప్పాలి. రాష్ట్ర విభజన నాటి నుంచి శాసనసభ, పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచుకుంటూ వస్తుంది. ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కొన్ని కీలకమైన భాగాలను తన పట్టును పెంచుకుంటోంది.
కానీ ఆ ఓటు బ్యాంకుకు పదిలం చేసే నాయకత్వం తెలంగాణలో లేకపోవడమే ఇందుకు కారణం. ఆ ధైర్యంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని హస్తినలోనే చెప్పారు. క్రౌడ్ పుల్లర్ లేకపోవడమే ఆ పార్టీకి తీరని లోటు. కొన్ని నియోజకవర్గాల్లోనే బలమైన నేతలున్నారు. అదీ కూడా కనీసం ముప్ఫై స్థానాల్లోనే కొంత స్థానిక నాయకత్వం బలంగా ఉంది. మిగిలిన చోట్ల పార్టీని చూసి, మోదీని చూసి ఓట్లు వేయాలి. పట్టణ ప్రాంతాలు అయితే ఓకే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం చూసి మాత్రమే ఓటు వేస్తారనే అంచనాతో బీజేపీ ఇప్పుడు బలమైన నాయకుడు కావాల్సి ఉందని పార్టీ నేతలు, క్యాడరే.

