ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓకు భారీ డిమాండ్ వచ్చింది. బిడ్డింగ్ చివరి రోజున 41.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ 140.11 రెట్,
నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 22.51 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 3.59 రెట్లు, వాటాదారులు 9.51 రెట్లు, ఉద్యోగులు 4.65 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. ఈ కంపెనీ తన ఐపిఓ ప్రారంభానికి ఒక రోజు ముందు సోమవారం యాంకర్ అలాట్మెంట్ ద్వారా రూ.2,663 కోట్లు సమీకరించి ఒక్కో షేరుకు రూ.574 చొప్పున 46.3 మిలియన్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది.
యాంకర్ కేటాయింపులో పాల్గొన్న ప్రముఖ సంస్థాగత పెట్టుబడిదారులలో బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ సాక్స్, హెచ్డీపీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా, నోమురా ఇండియా, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఉన్నాయి. తన ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.545-574 మధ్యగా నిర్ణయించింది. రూ.9,813 కోట్ల విలువైన ఈ ఐపీఓలో కంపెనీ ప్రమోటర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అముండి ఇండియా హోల్డింగ్స్ వారు ఆఫర్ ఫర్ సెల్ ద్వారా షేర్లు విక్రయిస్తున్నారు.
ఈ ఐపీఓ రూ. 2.98 లక్షల కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించి, మొత్తం బిడ్ విలువ భారతదేశంలో ఐదవ అతిపెద్ద ఐపిఓగా నిలిచింది. రిలయన్స్ పవర్, ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఐసియల్ తర్వాతి స్థానంలో ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ నిలిచింది. 2008లో రిలయన్స్ పవర్ రూ. 7.12 లక్షల కోట్ల బిడ్లను ఆకర్షించింది. ఆ తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓ రూ. 4.42 లక్షల కోట్ల బిడ్లను ఆకర్షించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 3.26 లక్షల కోట్ల బిడ్లను ఆకర్షించగా..ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఐసీఐ రూ. 2.99 లక్షల కోట్ల బిడ్లు సేకరించింది.
లిస్టింగ్ కు ముందు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉంది. జూలై 17న ఈ ఇష్యూ ఒక్కో షేరుకు రూ. 97 గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ)ను కలిగి ఉంది. ఇది రూ. 574 ఎగువ ధరల శ్రేణిపై సుమారు 16 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ ధరల శ్రేణి ఎగువన, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ సుమారు రూ. 1.17 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో అరంగేట్రం చేస్తుందని అంచనా వేస్తున్నారు. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా, హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా), ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా, జెఎం ఫైనాన్షియల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్ బుక్ లీనింగ్ లీనింగ్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ భారతదేశపు అత్యంత పురాతన ఆస్తి నిర్వహణ సంస్థగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సైట్లు మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కానీ, ఆమోదించడం కానీ బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించడం. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

