విశాలాంధ్రబ్యూరో-అమరావతి: ‘తల్లికి వందనం’ పథకం కింద రెండో విడత నిధులను ఈ నెల 22న ప్రభుత్వం విడుదల చేయనుంది. రూ.10,120.78 కోట్లు చెల్లించేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగమైన ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం ప్రభుత్వం జమ చేస్తోంది. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

