తెలంగాణ:మెదక్ జిల్లాకు చెందిన రాములు(60), రషీద్(40) అనే ఇద్దరు వ్యక్తులు కీసర పోలీస్ స్టేషన్ ( కీసర పోలీస్ స్టేషన్ )పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై గొర్రెలను తరలిస్తూ,రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తున్న సమయంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టి.రోడ్డు పక్కన పడుకున్న వీరి మీద నుంచి వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

