ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ శుక్రవారం భారీగా పెరిగింది. ఈ రోజు సెషన్లో 6 శాతం పెరిగింది. గత సెషన్లో రూ.235.65 వద్ద ముగిసిన షేర్ ప్రైస్.. ఈ రోజు రూ.249కి చేరుకుంది. చివరకు రూ.242 వద్ద స్థిరపండింది. మొదటి త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోవడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వడ్డీ ఆదాయం, ఫీజులు, కమీషన్ ఆదాయంలో బలమైన వృద్ధి, అధిక డివిడెండ్ ఆదాయం కారణంగా, మొదటి త్రైమాసిక ఆదాయాలు పెరిగాయని కంపెనీ ప్రకటించింది.
గత మూడు కాలంలో ఏకీకృత నికర లాభం నెలలతో 156 శాతం పెరిగి రూ.830 కోట్లకు చేరింది. జియో పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్ సొల్యూషన్స్ రాణించాయి. అలియాంజ్ ఇన్సూరెన్స్ జైంట్ వెంచర్లతో పాటు, తన బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్, బ్రోకింగ్ వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు కంపెనీ వివరించింది. జియో క్రెడిట్ నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.300 బిలియన్లు దాటడంతో అది బాగా వృద్ధి చెందిందని మోతీలాల్ ఓస్వాల్ గుర్తించింది.
ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 1.55 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.338 కాగా.. కనిష్ట స్థాయి రూ. 223.30 గా ఉంది. గత 6 నెలల వ్యవధిలో ఈ స్టాక్ 12 శాతం పడిపోగా, ఏడాదిలో 24 శాతం వరకు తగ్గింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ పాజిటివ్ గా స్పందించింది. కొనసాగుతున్న వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించిన పెరిగిన నిర్వహణ ఖర్చులను తీసుకుని మోతీలాల్ ఓస్వాల్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ ను రూ.315 గా ఫిక్స్ చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీ మెర్జ్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెపరేట్‌గా లిస్ట్ అయింది. జియో ఫైనాన్షియల్ పేమెంట్ బ్యాంక్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, ఫైనాన్సింగ్, పెట్టుబడి వంటి సేవలు అందిస్తోంది. 2023లో స్టాక్ ఎక్స్చేంజీల్లో జాబితా అయింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సైట్లు మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కానీ, ఆమోదించడం కానీ బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించడం. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

