జిల్లా అధ్యక్షులు అయుబుకాన్
విశాలాంధ్ర – ధర్మవరం : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కనీస టైం స్కెల్ అమలు, రెగ్యులరైజేషన్ సమస్యలపై జూలై 30, 31 తేదీలలో కలెక్టర్ల వద్ద ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయుప్కాన్, పెద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయుప్కాన్, ఎస్ హెచ్ భాష, ఆదినారాయణ, జేవీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు కార్యాలయం నందు సిఐటియుమండల స్థాయి సమావేశం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూఎన్నికలకు ముందు కూటమిప్రభుత్వం అన్ని రంగాల కార్మికులకు, స్కీం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న కార్మికులందరికీ పర్మినెంట్, సుప్రీం. తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించడానికి వారు హైకోర్టు డిమాండ్ చేశారు.అధికారులు పనిచేయించుకోవడమే కానీ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సమస్యల పరిష్కారంతోపాటు తదితర డిమాండ్ల సాధనకై ఈనెల 30, 31న, జరిగే కలెక్టరేట్ల ధర్నాలలో కార్మికులందరూ పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, విజయ, దిన, సరస్వతి, చంద్రకళ, ట్రాన్స్పోర్ట్ రంగం నాయకులు ఎస్,రఫీ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మేకల బాబు, ముకుంద, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు ఖాదర్ భాష, సివిల్ సప్లై యూనియన్ అధ్యక్షులు దాసరి బాలు, మున్సిపల్ ఆయా పాఠశాలల సంఘం నాయకులు చౌడమ్మ, జయమ్మ, పాల్గొన్నారు.

