ఢిల్లీ: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత. నీట్ లీకేజీ, ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్, అణిచివేత చర్యలకు నిరసనగా, ప్రధాని నరేంద్ర మోడీ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. మల్లికార్జునఖర్గే, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, ఇతర నేతలు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలను ధర్నా చేయగా.. గూండాగిరి నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేశారు. చేతులకు తాళ్లు కట్టుకొని.. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని, యువతపై లాఠీఛార్జ్ కి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎండిఎ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, నీట్ లీకేజీపై పార్లమెంటులో చర్చకు కూడా ఒప్పుకోవడం లేదని, నీట్ అంశంపై మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

