మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్ -డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. కొత్తగా విడుదలైన పోస్టర్లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. హీరోకు, పవిత్రమైన ఆవుకు మధ్య కనిపించే పేస్ ఆఫ్, ఈ సినిమా కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా చూపుతోంది. మారెమ్మ చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పా టలతో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంపొందించడం మేకర్స్ విజయవంతమయ్యారు.’మారెమ్మ’ సినిమా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, బలమైన భావోద్వేగాలతో మేళవించిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. మాధవ్ నటనకు అవకాశం ఉన్న పాత్రలో యాక్షన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో దీపా బాలు కథానాయికగా నటిస్తున్నారు.

