- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదించాలని మోదీకి దీప్కే విజ్ఞప్తి.
- లేకపోతే ప్రధాని రాజీనామా డిమాండ్ కూడా వస్తుందని వ్యాఖ్య.
- ఎన్నికల్లో మీకు ఓట్లు వేయరని వార్నింగ్..
CJP నిరసన: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తాజా హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ”మోదీ జీ.. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించండి. లేదంటే ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మాత్రమే పరిమితం కాదు.. మీ రాజీనామాను కూడా డిమాండ్ చేసే దిశగా వెళ్తుంది” అని దీప్కే అన్నారు.
కోట్లాది మంది విద్యార్థుల కన్నా ఒక అసమర్థ, విఫల మంత్రి ముఖ్యం కాదని, అలాంటి మంత్రిని కన్నా ముఖ్యుడని దేశంలో ఉన్నట్లుగా, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయరని గుర్తుంచుకోండి. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ బాధ్యత వహించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. చర్చలకు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. జేపీ నడ్డా కార్యాలయం లేదా నివాసంలో చర్చలకు మీకు వీలైన సమయంలో సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరోవైపు, తాము ఎక్కడికి రాబోమని ప్రభుత్వమే జంతర్ మంతర్ వచ్చి చర్చలు జరపాలని సీజేపీ డిమాండ్ చేసింది. జంతర్ మంతర్ లేదా కానిస్ట్యూషన్ క్లబ్ లాంటి తటస్థ వేదికలపై చర్చలకు సిద్ధమే అని ప్రకటించారు. చర్చలు జరగాలంటే ముందుగా కేంద్రమంత్రిని తొలగించాలని షరతు విధిస్తోంది.
#చూడండి | ఢిల్లీ: బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, “మోదీ జీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించాలని నేను మిమ్మల్ని మరోసారి అభ్యర్థిస్తున్నాను. లేకపోతే, ఈ సమస్య కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు మాత్రమే పరిమితం కాదు; ఇది మీ కోసం వస్తుంది. pic.twitter.com/H3pTqvx3TR
– ANI (@ANI) జూలై 23, 2026

