AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు ఏర్పడింది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇలాంటి తరుణంలో మళ్లీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో సైతం చిరుజల్లులు పడుతున్నాయి. ఆకాశం మేఘావృత్తమై వర్ష సూచన ప్రారంభమైంది. అలాంటి తరుణంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వర్షపు కీలకాలపై అప్డేట్ ఇచ్చింది. ఈరోజు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల కదలికతోనే ఈ మార్పు అని తెలుస్తోంది.
* ఈరోజు ఈ జిల్లాల్లో వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలకు ఈరోజు వర్ష సూచన ఉంది. అనేక జిల్లాల్లో వెలుగు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదు కావచ్చు అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఈ వర్షాలతో రైతులకు కొంత ఊరట దక్కే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతోంది. ఈరోజు ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, అమరావతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, తిరుపతి బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* రుతుపవనాల విస్తరణ..
రాష్ట్రంలో చాలా వర్షాలు కురుస్తున్నాయి. మారిన పరిస్థితుల కారణంగానే వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా నైరుతి రుతుపవనాలు మళ్లీ విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా అద్దంకి, శ్రీ సత్య సాయి జిల్లా ఆగలి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. నైరుతి రుతుపవనాల రాక కూడా ఆలస్యం అయింది. జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. జూలైలో సైతం లోటు ప్రారంభించారు. జూలై చివరి వారం గడుస్తున్నా వర్షాలు జాడలేదు. ఖరీఫ్‌లో భాగంగా వారి ఉడుపులు కూడా జరగలేదు. ఇలాంటి తరుణంలో వర్షాలు పడుతుండడం.. వర్షాలు కురుస్తాయని తెలుస్తుండడం ఉపశమనం కలిగించే విషయం. కానీ దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు ఉంది. దానికి ప్రధాన కారణం ఎల్ నినో. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఆందోళనతో ఉన్నారు. ఖరీఫ్ పై ఆశలు వదులుకుంటున్నారు.

